![]() |
![]() |
.webp)
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే ఈ వారం షో మంచి ఎంటర్టైనింగ్ గా ఉండేట్టు కనిపిస్తోంది. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ఫుల్ వైరల్ అవుతోంది. ఇందులో నూకరాజు, నాటీ నరేష్ స్కిట్ లో డైలాగ్స్ ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. "బయట యూత్ అంతా ఏదో ఒకటి కనిపెడుతూ ఉంటే మీరేం కనిపెడుతున్నారు" అంటూ నరేష్ నూకరాజు మీద ఫైర్ అవుతాడు "మీరు ఆపిల్ చెట్టు కింద ఉన్నప్పుడు ఆపిల్ కింద పడినప్పుడు మీరేం చేస్తారు" అని నూకరాజుని అడిగాడు నరేష్ "తినేస్తాం" అని చెప్పాడు నూకరాజు. "న్యూటన్ అలా చేయడు" అని నరేష్ చెప్పేసరికి "ఎందుకు ఆయనకు షుగరా" అన్నాడు నూకరాజు అనేసరికి నరేష్ నవ్వేసాడు.
తర్వాత హోస్ట్ సౌమ్య వచ్చి "రక్షా బంధన్ కదా నాకు రక్షా కావాలి" అనేసరికి "మాకు శిక్ష కాకూడదు" అని చెప్పాడు. "ఆసియాని పక్కన బెట్టుకుని ఏంటామాటలు" అని ఇంద్రజ నూకరాజుని అడిగారు "గుండెల్లో నాలుగు గదులు ఉంటాయి . ఒక గదిలో ఆసియా ఉంటుంది. మిగతా గదుల్లో వీళ్ళు ఉంటారు" అని చెప్పాడు. దానికి సౌమ్య, ఇంద్రజ షాకయ్యారు. ఇక నూకరాజు న్యూటన్ మీద వేసిన కౌంటర్ కి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు " న్యూటన్ గారి మీద జోక్స్ వెయ్యడం కరెక్ట్ కాదు ...ఆయన ఒక గ్రేట్ సైంటిస్ట్..మీ మైండ్ లో పెట్టుకోండి మర్చిపోకండి. కామెడీ కామెడీలా ఉండాలి వెటకారంగా కాదు" అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక వెంకీ మంకీ వేసిన ఏ సర్టిఫికెట్ జోక్ అర్ధం కాలేదంటూ తాగుబోతు రమేష్ అనేసరికి " ఆ జోక్స్ అర్ధం కావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి కింది స్థాయి వాళ్లకు అర్ధం కాదు" అంటూ రివర్స్ కౌంటర్ లు వేశారు. చలాకి చంటి, సందీప్ ఇద్దరూ కలిసి చెంబులతో నీళ్లు తీసుకెళ్లే కాన్సెప్ట్ కొంచెం ఫన్నీగా అనిపించింది. అలాగే స్టార్టింగ్ లో రాకెట్ రాఘవ స్కిట్ కూడా వెరైటీగా ఉంది. తన భార్యకు జలుబు చేస్తుందని కాశ్మీర్ హనీమూన్ కి రాఘవ ఒక్కడే వెళ్లడం కాన్సెప్ట్ తో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు రాఘవ.
![]() |
![]() |